మనము ఎన్నో వేళ్ళ సంవత్సరాలుగా విశ్వసిస్తూ నమ్ముతూ వస్తున్న హిందూ పురాణాలు ప్రకారం ఈ తరం వాళ్ళు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరికీ బ్రహ్మదేవుడు పుట్టిన వెంటనే వారి నుదుటిపై కొన్ని రాతలు రాస్తాడు. ఈ విధంగా రాసిన రాతలే మన భవిష్యత్తు అని మీకు తెలుసా. అంతే కాకుండా ఈ విధంగా రాసిన రాతలను మార్చాలంటే ఇవి గీసిన బ్రహ్మకు కూడా సాధ్యం కాదట.