మనిషి యొక్క జీవితం తను చేసే కర్మల పై ఆధారపడి ఉంటుందని హిందువుల నమ్మకం. అంతే కాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం కూడా మన పూర్వ కర్మఫలం అని పురాణాలు చెబుతున్నాయి. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం దక్కుతుందన్నది దీని యొక్క సారాంశం. అయితే మనం చేసే కర్మలు చెడు మరియు మంచిపై ఆధారపడి ఉంటాయి.