ఏకాదశి..హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడం, నేతితో చేసిన నైవేద్యం సమర్పించడం, పూజగదిని ప్రత్యేకంగా అలంకరించి అందంగా చేసి పూజలు జరుపుతుంటారు. అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ప్రతి మాసం లోనూ శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది.