శ్రీ కృష్ణుడు హిందువులు నమ్మకంగా కొలిచే దేవుళ్లలో ఒకరు. ఆ శ్రీ కృష్ణ భగవానుడికి మంచి విశిష్టత ఉంది. ఆ శ్రీ మహా విష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, మరియు చిత్రీకరిస్తుంటారు.