ఉగాది...తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే విషయం ఉగాది పచ్చడి. షడ్ రుచుల కలయికతో తయారు చేసే ఈ పచ్చడి మానవుల జీవన శైలి ఎలా ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది. ఆరు రకాల వంట పదార్ధాలతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది.