చాలా మందికి సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి అన్న సందేహం కలగొచ్చు....ఇపుడు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. నదులన్నీ స్త్రీ రూపకం కాగా ..సముద్రుడు మాత్రమే పురుష రూపకంగా వర్ణింప బడి ఉన్నాడు. ఇక సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే...గ్రహణాలు ఏర్పడినప్పుడు, సంక్రాంతి వచ్చినప్పుడు వైశాఖ పున్నమి రోజు,అదే విధంగా అమావాస్య నాడు సముద్ర స్నానం చెయ్యాలి.