తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈరోజే మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే ఇది తెలుగువారి మొదటి పండుగ అని చెప్పవచ్చు.. ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది.