సాయిబాబా... మానవ రూపంలో ఈ భువిపై జన్మించిన దైవమూర్తి గా ప్రజలు బాబాని కొలుస్తుంటారు. సాయిబాబా చరిత్ర అమోఘం, ఆయన లీలలు అద్భుతం. హిందువులలో ఎక్కువమంది కొలిచే దేవుళ్ళలో సాయిబాబా ఒకరు. నిత్యం పూజ చేస్తూ ఆ బాబాను స్మరిస్తూ ఉంటారు భక్తులు. ఇక గురువారం అయితే సాయిబాబా ప్రతిమకు పాలాభిషేకం చేసి, ప్రత్యేకమైన నైవేద్యం పెట్టి ధూప దీపాలతో పూజలు జరుపుతుంటారు.