దేవుడు సర్వాంతర్యామి.. ఈ సువిశాల ప్రపంచంలో జరిగే కర్మలన్నీ దేవుడి యొక్క ఆదీనంలోనే జరుగుతాయి అన్నది హిందువుల యొక్క విశ్వాసం. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటుంటారు. ఇందులో అర్థం, పరమార్థం ఎంతో ఉంది. దేవుని ఆదేశం లేనిదే ఈ లోకంలో ఏ చిన్న కర్మ కూడా జరగదన్నది దాని అర్థం.