కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఎంత సంపాదించినా గుప్పెడు అన్నం నోటిలోకి పోనిదే... మనకు నిద్ర పట్టదు. ఆ అన్నం దొరకాలంటే అందుకు కారణం అన్నపూర్ణా దేవి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మన కుటుంబంలో సుఖ సంతోషాలు వెలగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగాలన్నా, మూడుపూటలా కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రకు కావాల్సిన ప్రశాంతత.. ఇవన్నీ మీ కుటుంబానికి దక్కాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉండాలి.