అక్షయ తృతీయ అని వినగానే గుర్తొచ్చేది బంగారం. అక్షయ తృతీయ నాడు బంగారం కొని ఇంటికి తీసుకొస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొచ్చినట్లని అంటారు పెద్దలు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది. ఈ తిధి ఇంటికి శుభ పరిణామాలు, విజయాలను, సకల సంపదలను, సంతోషాన్ని తీసుకొస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.