మనం నివాసముంటున్న గృహము ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లోని వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉంటూ దైవభక్తిని కలిగి ఉండాలి . అప్పుడే ఆ ఇంట్లో ధన దేవత శ్రీ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచడానికి కావలసిన ముఖ్య వస్తువులలో చీపురు ప్రధానమైనది. ఇంటి లోపల, వెలుపల శుభ్రం చేయుటకు చీపురు అవసరం. చీపురు ను దైవ సంభూతంగా చెబుతుంటారు.