సహజంగా ప్రతి మనిషికి కలలు వస్తుంటాయి. మన పెద్దవాళ్ళు కలలకు కొన్ని అర్థాలను చెప్పారు. అయితే కొందరు వీటిని నమ్ముతారు. మరికొందరు వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తారు. నమ్మినా నమ్మకున్నా మన పూర్వీకులు కలలు మన భవిష్యత్తును చేప్పే సూచనలని వాటికి కొన్ని అర్దాలను చెప్పారు. భగవంతుడు మనకు అందించబోయే వాటిని కలల ద్వారా మనకు ముందుగానే కనబరుస్తాయని పండితులు చెబుతున్నారు.