నిన్న మొన్నటి వరకు అయోధ్య రామ మందిరంపై చెలరేగిన వివాదాలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ఆ శ్రీ రాముని పరమ భక్తుడు హనుమంతుని జన్మస్థలంపై కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. హనుమాన్ జన్మస్థలం ఇక్కడే అంటూ ఒకరు చెబుతుంటే, మరొకరు ఆధారాలు చూపించండి అంటూ వాదనకు దిగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.