హిందువులకు అక్షయ తృతీయ అనునది ఎంతో పరమ పవిత్రమైన రోజు. మన పూర్వీకుల నుండి అక్షయ తృతీయ నాడు పండుగ జరుపుకోవడం మన ఆచారంలో ఉంది. అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటి అంటే ? ఆ రోజున ఎవరైతే తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరచుకుని, పూజ గదిని అలంకరించి , శ్రీ లక్ష్మీ నారాయణులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారికి, వారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.