ఇంట్లో ఏదైనా పండుగ అయినా, శుభకార్యాలు అయినా వెంటనే ముందుగా చేసే పని, ఇంటి ముందు గుమ్మానికి తోరణాలు కట్టడం. తెల్లవారుజామునే లేచి తలస్నానమాచరించి తర్వాత గుమ్మాలకు పసుపు రాసి, మామిడి ఆకులుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని గుమ్మాలకు తోరణాలుగా కడతారు. ఆ తర్వాత మిగిలిన పని, పిండి వంటకాలు, పూజలు వంటి పనులు చేసుకుంటారు.