అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నం తినేటప్పుడు కూడా ఒక పద్ధతి, విధానం అనేది చాలా ముఖ్యం. ఎంతో పవిత్రమైన అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి అంటున్నారు వేదాలను అవపోశనపట్టిన పండితులు. పూర్వకాలంలో అన్నాన్ని విస్తరాకులలో తినేవారు.