ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా మన సంస్కృతులపై, ఆచార వ్యవహారాలపై, దేవుడిపై విశ్వాసాన్ని, భక్తిని వీడరాదు. అవే మనకు నిరంతరం తోడుంటాయి. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం వచ్చినా వెంటనే ఆ దేవుడ్ని తలుచుకుంటాం. ఆ కష్టం నుండి గట్టెక్కించమని ఆ దేవుడికి ప్రార్దనలు చేస్తాం.