భారతదేశంలో ఉన్న ప్రముఖ నదులలో గంగానది ఒకటి. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన పురాణ గాథల ఆధారంగా గంగావతరణం ఎలా జరిగిందన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షం పదో రోజున గంగాదేవి దివినుండి ఈ భువి పైకి చేరిందని మన పురాణాల్లో చెప్పబడింది .