పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం భక్త జనాలు ప్రపంచనలుమూలల నుండి లక్షల్లో వస్తుంటారు. వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే ప్రత్యక్షదైవం అని, కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే పురుషోత్తముడని విశ్వసిస్తూ భక్తులు వారి కోరికలను ఆ ఏడుకొండలస్వామికి మొర పెట్టుకోవడానికి కదలి వస్తారు.