వెలుగు వేడి లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేదు. జాతి మత బేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. ఆయన ప్రత్యక్ష దైవానికి సాక్షి జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికి మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండడం కూడా సాధ్యం కాదు.