తాజాగా శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిందు అనే యువతి స్వామి దర్శనానికి రాగా, అయ్యప్ప భక్తులు ఆమె పై కారం చల్లారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిన్న మొన్నటి వరకూ పంబకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలక్కల్ వరకే భక్తులను అనుమతించిన పోలీసులు, పరిస్థితి ప్రశాంతంగా ఉందన్న భావనతో పంబ వరకూ వాహనాలను అనుమతించడంతోనే ఈ ఘటన జరిగిందని సమాచారం.  

 

Image result for sabarimala

 

గతంలో కూడా బిందు అయ్యప్పను దర్శించుకుంది. బిందు, కనకదుర్గ అనే మహిళలు జనవరిలో అయ్యప్పను దర్శించుకున్నారు. ఆలయంలోకి పరుగులు పెడుతూ వెళ్లిన్న బిందూ, కనకదుర్గలు స్వామిని దర్శనం చేసుకున్న వీడియోలు అయ్యప్ప భక్త సమాజంలో తీవ్ర కలకలం రేపిన సంగతి అందరికి  తెలిసిందే. ఆపై ఆలయాన్ని మూసివేసిన ప్రధానార్చకులు, శుద్ధి చేయడం కూడా వివాదాస్పదమైంది.  ఈ సారి బిందు ఒంటరిగా అయ్యప్పను దర్శించుకునే ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది.

 

ఇటీవల అయ్యప్ప మాలధారులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. కార్లు, 12 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న వాహనాలను పంపానది బేస్ క్యాంపు వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.  టీడీబీ తాజా నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

గత శనివారం మండల పూజల కోసం  అయ్యప్ప ఆలయం తెరుకుంది. వారం రోజుల్లోనే ఏకంగా 3.5 లక్షల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించు కోవడం జరిగింది. మున్ముందు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో కార్లను పంపానది బ్యాస్ క్యాంపు వరకు అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: