మన పూర్వీకులు అసామాన్యులు. వారి చేతిలో నిర్మితమైన కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అద్భుతాలు జరుగుతుంటాయి. వారి ఖగోళ, వాస్తు పరిజ్ఞానమే ఇందుకు కారణం. అలాంటి ఓ అద్భుత ఆలయమే కర్ణాటకలోని చంద్రమౌళీశ్వర దేవాలయం. ఇది హుబ్లీలో ఉంది.

 

ఈ ఆలయానికి 900 సంవత్సరాల చరిత్ర ఉంది. అంతటి పురాతన ఆలయం ఇది. వివిధ ఋతువులలో సూర్యుని గమనాన్ని తెలుసుకున్న మన పూర్వీకుల జ్ఞానం, శాస్త్రం ఎంతో అద్భుతం. అలాంటి విశేష అద్భుతానికి సాక్షీభూతం ఈ దేవాలయం.

 

ఇక్కడి విశేషం ఏంటంటే.. ఒక్క శివరాత్రి నాడు మాత్రమే తూర్పు నుంచి వచ్చిన సూర్యకిరణాలు ప్రధాన శివలింగం మీద ప్రసరించి అలాగే రెండవ గర్భగృహం లో వున్న చతుర్ముఖ శివలింగం మీద కూడా ప్రసరిస్తుంది. ఇది ఒక్క శివరాత్రి నాడు మాత్రమే జరుగుతుంది .

 

ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉంటాయి. మొదటి శివలింగానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. మరో లింగాన్ని చతుర్ముఖ లింగం అంటారు. అంటే ఈ లింగానికి నాలుగు ముఖాలు ఉంటాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: