హిందువులు జరుపుకునే పెద్ద పండగలలో మహా శివరాత్రి కూడా ఒకటి. శివునికి ఎంతో ప్రీతి పాత్రమైన రోజుగా శివరాత్రిని అంటూ ఉంటారు. ఈ మహా  పర్వదినం నాడు భక్తులు ఉదయాన్నే లేచి పూజలు చేసుకుని,  ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అంటే మరీ మంచి నీళ్ళు కూడా తాగకుండా శివుడికి ఉపవాసం ఉండాలని  ఎవరూ చెప్పలేదు.అలా చేయడం వలన నిరసించిపోతూ ఉంటారు. అలా శరీరాన్ని కష్టపెట్టడం వలన , భగవంతుని వైపు మనసును లగ్నం చేయడం కష్టతరం అవుతుంది. అందుకనే ఉపవాసం ఉండేవారు అటు ఆరోగ్యం దెబ్బతినకుండా  ఇటు ఉపవాస దీక్ష పాడవకుండా తగిన  జాగ్రత్తలు పాటించడం మంచిది.


 దీని కోసం ఏం చేయాలనే దాని గురించి వైద్య నిపుణులు పలు సూచనలు ఇచ్చారు.అవేంటంటే  ఉపవాసం ఉండే రోజు కనీసం ఒక  6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. పండ్లు తినడం వలన శక్తి వస్తుంది. అలాగే పుచ్చకాయ తినడం కూడా చాలా మంచిది. ఎందుకంటే పుచ్చకాయలో  నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే  బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ లాంటివి చేసుకుని తాగితే చాలా మంచిది.


ఇలా ఈ జ్యూస్ తాగడం వలన ఆకలి వేస్తున్నది  అనే భావన ఉండదు.అలాగే కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు.శివరాత్రి రోజున  ఉపవాసం ఉండి జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. దేవుని మీద భక్తి ఎంత ముఖ్యమో ఆరోగ్యం మీద శ్రద్ద కూడా అంతే ముఖ్యం.ఉపవాసం ఉండి నిరసించి పోతే భక్తి మాట ఏమోగానీ నీరసం వలన మన ద్యాస అంతా దేవుడి మీద ఉండదు. పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: