దేశంలో అక్రమంగా సంపాదించాలి అనే అత్యాశతో ఒక స్థాయిలో మనిషి పూర్తిగా దిగజారిపోతున్నాడు. తనకు అవసరం అంత  మేరకే ఉపయోగించుకోవాలి అనే కనీస నీతిని మరిచిపోయి, ఇస్తాను సారంగా పోగు చేసుకుంటున్నాడు. దీనితో ఎవరి ఆస్తులను కాజేస్తున్నాడో కూడా తెలియకుండా ఆయా వర్గాల వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కొందరు. అయితే ఇది కేవలం వాళ్ళతో పొవట్లేదు, వారి చుట్టూ ఉన్నవారి ని కూడా కలుషితం చేస్తూనే ఉంది. కోర్టులలో ఇలాంటి కేసులు ఎన్నో ఎంతో కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయి. అవి తేలవు, అసలు వారికి ఈలోపు మరణం కూడా సంభవిస్తూనే ఉంటుంది. ఇది సంపాదన వలన అది కూడా అత్యాశ ఉన్న వారి వలన పెరిగిపోతున్న సమస్యలు.

దొంగతనంగా లేదా మోసం చేసి సంపాదించవచ్చు గాక, అది ఎన్నాళ్ళు స్వేచ్ఛగా ఆస్వాదించగలవు, అనే ప్రశ్న వేసుకుంటే అతి అనేది అక్కడే ఆగిపోతుంది. తాజాగా ఇలాంటి ఒక కేసులో తమిళనాడు హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోట్లాది రూపాయల విలువైన ఆలయ భూమిని దురాక్రమణల నుండి రక్షించుకుంది. ప్రాంతీయంగా పూనపల్లె హైవే సమీపంలో ఉన్న భూమి అది, ఒక ఎకరా ఉంటుంది, దానివిలువ 300 కోట్లు ఉంటుంది, ఇది కాంచీపురం ఏకాంబరేశ్వర్ దేవాలయానికి చెందినది. దానిని ఛారిటీ మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ, ఆక్రమణలకు గురైన దేవాలయ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఆక్రమణ చేసిన వారు ఈ భూమి విలువైనది కాబట్టి అక్కడ అప్పుడే కొన్ని నిర్మాణాలు కూడా చేశారు. అయితే ఆయా నిర్మాణాలు  ట్రస్ట్ కు ఉపయోగపడనున్నాయా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే కమిటీ వేసినట్టు తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 1000 ఎకరాలు ఆక్రమణ నుండి దక్కించుకున్నట్టు వారు తెలిపారు. ఆయా భూములు మళ్ళీ ఆక్రమణ దారుల చేతిలోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఆక్రమణ దారులకు ఏయే భూములను ఆక్రమిస్తున్నది కూడా సోయ లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆధ్యాత్మిక భవనాలు నమ్మేవారు ఎవరు ఆలయ భూములను ఆక్రమించుకోరని వారు అన్నారు. ఇలాంటి చర్యలకు మానవ శిక్షాస్మృతి మాత్రమే కాదు భగవంతుని కోపానికి కూడా ఆయా వంశాలు గురికావాల్సి వస్తుంది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: