కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఉండడంతో ఇతర దేశాలు, ఇండియా నుండి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఆస్ట్రేలియా చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఒక ప్రకటనలో ఆ దేశ ప్రధాని స్కాట్ మోరీసన్ తెలిపారు. ఈ రద్దు మే 15 వరకు కొనసాగుతుందని చెప్పారు.