ఐపీఎల్ అన్ని టీమ్స్ లాగే టైటిల్ గెలిచే సత్తా ఉన్న జట్టుగా బరిలోకి దిగింది వార్నర్ సారధ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఒక్క మ్యాచ్ మినహా ఇప్పటి వరకు జరిగిన అయిదు మ్యాచులలో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ జట్టును ముఖ్యంగా పట్టి పీడిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం.