ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ ఉత్కంఠగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సారి కొత్త ఐపీఎల్ విన్నర్ ని చూసే అవకాశం లేకపోలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఊహించిన విధంగా మ్యాచ్ లు సాగడం లేదు. ఇకపోతే డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆశలు రాను రాను సన్నగిల్లుతున్నాయి.