ప్రస్తుతం క్రికెట్ బౌలింగ్ లో నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని సచిన్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్ట్  క్రికెట్ లో అతి కొద్ది మంది మాత్రమే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో పేస్  బౌలింగ్ లో నాణ్యత లోపించిందన్నారు. ఈ కారణంతో క్రికెట్  ప్రాభవం కోల్పోతోయే రోజులు వచ్చాయని సచిన్ వార్నింగ్ ఇచ్చారు.


ఇదే సమయంలో సచిన్ పాత రోజులు గుర్తు చేశారు.. 1870-80 ల్లో సునీల్  గవస్కర్ , ఆండీ రాబర్ట్స్ , డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్  వంటి దిగ్గజాలు ఉన్నారన్నారు. వారి మధ్య పోటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసేవారని తెలిపారు. ఆ తరువాత కాలంలో తనకు  మెక్ గ్రాత్, వసీం అక్రమ్ కు మధ్య పోటీ కోసం కూడా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూసేవారని అన్నారు.


ప్రస్తుతం ఐపీఎల్ ను చూసి వన్డేలకు ఎంపిక చేస్తున్నారని అది కరెక్ట్ కాదని సచిన్ అన్నారు. క్రికెట్లో రోజురోజుకూ పోటీతత్వం తగ్గిపోతోందన్నారు సచిన్. ప్రస్తుతం కేవలం భారత్ , ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్  మధ్యే పోటీ నెలకొందన్నారు. ఫాస్ట్  బౌలింగ్ లో నాణ్యత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సచిన్ అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: