టెన్నిస్ క్రీడలో భారత్ కి ఎన్నో పథకాలను అందించిన క్రీడాకారిణి సానియా మీర్జా. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా  కూడా ఉంది సానియా మీర్జా. తన ఆటతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి విజయాన్ని సొంతం చేసుకోగల సత్తా సానియామీర్జా సొంతం. అటు అందంలోనూ సానియా మీర్జా ఎవ్వరికి  తీసిపోరు అనే చెప్పాలి. అయితే పెళ్లయిన తర్వాత ఈ అమ్మడు దూకుడు కాస్త తగ్గిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గర్భవతిగా ఉండడంతో పూర్తిగా టెన్నిస్కు దూరమైపోయింది సానియా మీర్జా. సానియా మీర్జా అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రీడాకారిణి సానియా మీర్జా కోర్టు లోకి అడుగు పెట్టి టెన్నిస్ ఆడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సానియా మీర్జా కూడా మళ్లీ కోర్టులోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే సానియా మీర్జా గర్భవతిగా ఉన్నప్పుడు,  డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా బరువు పెరిగి పోయింది. దీంతో సానియా మీర్జా మళ్లీ టెన్నిస్ కోర్టు లోకి అడుగు పెట్టే అవకాశం లేదని అందరూ భావించారు. అయితే కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత భారీగా బరువు పెరిగిన సానియా మిర్జా ఇప్పుడు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ బరువును తగ్గించే పనిలో పడింది. ఇంకొన్ని రోజుల్లో కోర్టు లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఇరవై ఆరు కిలోల బరువు తగ్గింది సానియా మీర్జా. అభిమానులు కూడా తమ అభిమాన క్రీడాకారిణి ఇంకొన్ని రోజుల్లో కోర్టు లోకి అడుగుపెట్టి ఆట  మొదలు పెట్టపోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాలుగు నెలల్లోనే ఇరవై ఆరు కిలోల బరువు తగ్గడం ఎలా సాధ్యమైంది అన్న విషయాన్ని తాజాగా ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు సానియా మీర్జా. 

 

 

 తాను గర్భవతి అయిన తర్వాత చాలా బరువు పెరిగాను అని ... అది ఎవరి లో అయినా సాధారణమైన  విషయమే అని... కానీ అది గుర్తించకుండా తాను బరువు పెరగడంతో చాలా మంది తనను టోల్ చేశారని సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఇజాన్  పుట్టిన మూడు నెలల తర్వాత నుండి వ్యాయామం చేయడం మొదలు పెట్టానని సానియా మీర్జా తెలిపింది. ఇక నాలుగు నెలల్లోనే మునుపటిలా సాధారణ స్థాయికి చేరుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనకు వంట చేయడం రాదని అందుకే మంచి కుక్ ని  పట్టుకున్నాను  అంటూ సానియా మీర్జా తెలిపింది. వంట చేయడం కూడా తనకు ఇష్టం ఉండదని అందుకే వంట నేర్చుకో లేదని వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: