పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు పై..  ఆటగాళ్ళ ప్రతిభపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. గతంలో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ గురించి వ్యాఖ్యానించిన  షాహిద్ అఫ్రిది బుమ్రా బౌలింగ్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించాడు.  ఇక ఇప్పుడు మరో సారి.. భారత ప్రతిభ పై ప్రశంసల వర్షం కురిపించాడు షాహిద్ అఫ్రిది. ఎంతో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం ఎలాగో..  టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ని చూసి పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ లు  నేర్చుకోవాలి అంటూ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.



 కాగా ప్రస్తుతం భారత క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ పాత్ర ఎంతగానో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి అండర్-19 జట్టుకు కోచ్ గా  కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ ఎంతోమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను భారత జట్టుకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో  రాటుదేలిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఆటగాళ్ల మధ్య గత కొంత కాలం నుంచి కమ్యూనికేషన్ సమస్య వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు షాహిద్ అఫ్రిది.



 ఇక ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆటగాడు అమీర్ తనను  క్రికెట్ బోర్డు టార్చర్ పెడుతుంది అంటూ వ్యాఖ్యానించడంపై స్పందించిన ఆఫ్రిది మాట్లాడుతూ..  ఇది మంచి సంప్రదాయం కాదు..  ఆటగాళ్లు మేనేజ్మెంట్ మధ్య సామరస్య వాతావరణాన్ని క్రికెట్ బోర్డు కల్పించడం ఎంతో ఉత్తమం. ఒకవేళ టీమ్ నుంచి ఆటగాని తప్పించాలి అనుకుంటే అతనితో కోచ్ మాట్లాడి మానసికంగా సిద్ధం చేయాలి.  పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా  ఉండేందుకు కొంతమంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు అలా కాకుండా.. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ లు భారత్ జట్టు అండర్-19 కోచ్ రాహుల్ ద్రావిడ్ లాగా.. యువ క్రికెటర్లపై దృష్టిసారిస్తే ఎంతో మెరుగైన ఫలితం ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది ప్రతిభావంతులైన యువ  ఆటగాళ్లను ద్రావిడ్  తెరమీదికి  తెచ్చారు అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: