ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇటీవలే ఇండియాలో ఐపీఎల్ కూడా జరుగుతుండగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఐపీఎల్ టోర్నీ కి ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ సంగతి పక్కన పెడితే ఈ ఏడాది భారత్లో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే టి20 వరల్డ్ కప్ జరుగుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక టి20 వరల్డ్ కప్ భారత్లో జరగడం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
భారత్లో టి20 వరల్డ్ కప్ నిర్వహణపై ప్రస్తుతం ఎన్నో సందేహాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇటీవలే బిసిసిఐ దీనిపై స్పందించింది.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని.. అత్యవసర ప్రణాళిక ప్రకారం టి 20 వరల్డ్ కప్ యూఏఈ లో జరిగే అవకాశం ఉంది అంటూ బీసీసీఐ జనరల్ మేనేజర్ ధీరజ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు అయితే టి20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా జరిగినప్పటికీ ఆతిథ్య హక్కులు మాత్రం బిసిసిఐ వద్ద ఉంటాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి