గత కొన్ని రోజుల నుంచి టెస్టు ఫార్మాట్లో టీమిండియా లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు ఇషాంత్ శర్మ. గతంలో ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం దొరకడమే అంతంత మాత్రంగా మారిన ఇషాంత్ శర్మ.. ఇటీవలే మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కీలక వికెట్లు పడగొడుతున్నాడు. ఇక టీమిండియా జట్టులో కీలక బౌలర్ గా మారిపోయాడు. ఇక ఇటీవల కాలంలో టీమిండియా టెస్టు పర్యటనలు అన్నింటిలోనూ స్థానం సంపాదించుకున్నాడు ఇషాంత్ శర్మ. ఇకపోతే ఇటీవల టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.  కాగా అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా.



 ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కీలకం గా మారిపోయాడు.  కావలసినప్పుడల్లా కీలక వికెట్లు పడగొట్టాడు ఇషాంత్ శర్మ.  కానీ చివరికి టీమిండియా బ్యాటింగ్ విభాగం పేలవ ప్రదర్శన కారణంగా మ్యాచ్ ఓటమి చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు మరికొన్ని రోజుల్లో అటు ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇకపోతే ఇటీవల వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు.  కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది.



 దీంతో ఇటీవలే వైద్యులు అతనికి కుట్లు కూడా వేశారు  ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు ఇషాంత్ శర్మ.  దీంతో ఇషాంత్ శర్మ ఇక ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై ఎన్నో అనుమానాలను నెలకొన్నాయి. అయితే ఇటీవలే వైద్యులు గుడ్ న్యూస్  చెప్పారు. ఇషాంత్ శర్మ గాయం అంత సీరియస్ గా లేదు అంటూ చెప్పుకొచ్చారు వైద్యులు. పది రోజుల తర్వాత కుట్లు తీసేస్తామని చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడటానికి ఇంకా ఆరు వారాల సమయం ఉందని.. ఆ సమయంలో ఇషాంత్ శర్మ పూర్తిస్థాయిలో కోలుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఇషాంత్ శర్మ అందుబాటులో ఉంటాడని ఇటీవలి వైద్య నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: