ఇటీవలే ఇండియన్ క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ తెరమీదికి వస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో వరుసగా టీమిండియా  విఫలమవుతున్న నేపథ్యంలో టీమిండియాకు కోచ్ గా రావిశాస్త్రి తప్పించాలని డిమాండ్ తెర మీదకు వస్తున్నాయి.  అయితే ప్రస్తుతం అండర్ 19 జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను తయారు చేశాడని ఇక అలాంటి రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా కోచ్ గా నియమిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాలామంది.



 వెంటనే రవిశాస్త్రిని కోచ్ పదవి నుంచి తప్పించి ఇక రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా కోచ్ గా నియమించాలి అంటూ సూచిస్తున్నారు. అయితే ఇటీవలే టీమిండియా- ఏ జట్టుకు రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరిస్తూ ఉండగా.. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా -బి జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే ఇక రాహుల్ ద్రావిడ్ ను పూర్తి స్థాయి కోచ్ గా మార్చాలని డిమాండ్ లు తెర మీదకు వస్తున్నాయి.  ఇటీవలే రెండో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఈ డిమాండ్ మరింత ఎక్కువ అయిపోయింది.  రావిశాస్త్రిని తప్పించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు కోరుతున్నారు .



 ఇలాంటి సమయంలో ఇక రావిశాస్త్రిని కోచ్ పదవి నుంచి తప్పించడంపై భారత మాజీ ఆటగాడు కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ ను తయారు చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కానీ అత్యవసరంగా రవిశాస్త్రిని కోచ్ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. రవిశాస్త్రి సమయంలో టీమిండియా సరైన విజయాలు సాధించలేక పోతుంది అని అందరూ అంటున్నారు.  అయితే రవిశాస్త్రి సమయంలోనే టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించింది. ఇక 2019లో వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వరకు వెళ్ళింది. మొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో  ఫైనల్ వరకు వెళ్ళింది. ఇలా రవిశాస్త్రి కోచింగ్ లో టీమిండియా మంచి ఫలితాలను అందిస్తుంది  అందుకే రావిశాస్త్రిని తప్పించాల్సిన అవసరం లేదు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: