ఇక్కడ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా ఇలాంటిదే చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అతడు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరి ఆటగాడికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూ టీ20 బ్లాస్ట్ క్రికెట్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే లంక షేర్- యార్క్షైర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక లంక షైర్ ఇన్నింగ్స్ మధ్యలో లుక్ బెల్స్ మీడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్ స్ట్రైక్ ఉన్న స్టివెన్ క్రాఫ్ట్ కు రన్ కోసం కాల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఇక గ్రీజు మధ్యలో పరిగెడుతున్న సమయంలో నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇక అతని పీక్క పట్టేయడంతో ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడి పోయాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్నాడు ఫీల్డర్. ఇక వెంటనే రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే కెప్టెన్ రూట్ వద్దు అంటూ వారించడంతో ఆగిపోయాడు.
అంతే కాదు ఇక్కడ గాయపడి క్రీజులో పడిపోయి విలవిలలాడుతున్న ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్లి సహాయం చేశాడు. ఇక వెంటనే ఫిజియో తో పాటు చికిత్స చేయించి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు రూట్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇక జో రూట్ క్రీడాస్ఫూర్తి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కెప్టెన్ అంటే ఇలాంటి క్రీడాస్ఫూర్తిని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉండాలి అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లంక షేర్ జట్టు 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టుపై ఘనవిజయాన్ని సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి