స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస ఓట‌మి పాలు చెంద‌డంతో సోష‌ల్ మీడియా లో ట్రోల్స్ వ‌స్తున్నాయి. జ‌ట్టు పేల‌వమైన ప్రద‌ర్శ‌న చేస్తుడ‌టంతో హైద‌రాబాద్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చిన్న చిన్న ట‌ర్గెట్ కూడా ఛేజ్ చేయ‌డంలో విఫ‌లం అవుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ ఐపీఎల్ 2021 లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘోరం గా విఫ‌లం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచ్ లు ఆడితే కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ లో విజ‌యం సాధించింది. మిగిలిన ఎన‌మిది మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. దీంతో అభిమానుల ఆగ్ర‌హా జ్వాలల‌కు బ‌లి అవుతుంది.
ముఖ్యంగా జ‌ట్టులో మ‌నీశ్ పాండే, కేద‌ర్ జాద‌వ్ అన‌వ‌స‌రం అని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమాన‌లు ట్రోల్స్ చేస్తున్నారు. వీరిని బ్యాన్ చేయాల‌ని అంటున్నారు. ఈ ఇద్ద‌రు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రోఛైంజ్ నుంచి తీసుకున్న డ‌బ్బు తీరిగి ఇచ్చేయాల‌ని కామెంట్లు పెడుతున్నారు. చివ‌రి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తో చిన్న టార్గెట్ కూడా అందు కోలేద‌ని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ ఓట‌మి చెంద‌డంతో అధికారింగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్ర మించింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో రాణించాల్సిన మిడి లార్డ‌ర్ బ్యాట‌ర్స్ ఘోరం గా విఫ‌లం అయ్యారు. మ‌నీష్ పాండే 13 ప‌రుగులు చేయ‌డానికి 23 బంతుల‌ను ఆడాడు. అలాగే కేద‌ర్ జాద‌వ్ 12 బంతుల్లో 12 ప‌రుగులే రాబ‌ట్టాడు. దీంతో మీరు టీ ట్వంటి ఆడుతున్నారా.. లేదా టేస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా అని ట్వీట్ట‌ర్ లో పోస్టు లు పెడుతూన్నారు. కాగ ఈ సీజ‌న్ లో మ‌నీశ్ పాండే ఒకే మ్యాచ్‌లో 61 ప‌రుగులు చేశాడు. మిగిలిన ప్ర‌తి మ్యాచ్‌లో దారుణంగా విఫ‌లం అయ్యాడు.  దీంతో వ‌చ్చే ఆక్ష‌న్ లో వీరిని విడిచిపెట్టాల‌ని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్  అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: