భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఈ నెల 24వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.. ఎందుకు అంటారా.. ఎన్నో ఏళ్ల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ ఆరోజు జరగబోతుంది. చిరకాల ప్రత్యర్ధులు గా ఉన్న భారత్-పాకిస్థాన్ జట్లు మైదానంలోకి దిగి హోరాహోరీగా పోటీపడుతున్నాయి.  ఈనెల 24వ తేదీన టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అంటే చాలు అది హై వోల్టేజీ మ్యాచ్ గా మారుతుంది అనే విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ తో తలపడపోయే జట్టు ఎలా ఉండాలి అనే దానిపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ టి20 జట్టును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ పాకిస్తాన్తో మ్యాచ్ కోసం  తాను అంచనా వేసిన టి20 జట్టును ప్రకటించాడు. ఈక్రమంలోనే శార్దూల్ ఠాగూర్ లేదా భువనేశ్వర్ కుమార్ లలో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదేసమయంలో ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన వామప్ మ్యాచ్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచ కప్ లో భారత్ ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగుతుందని.. తుది జట్టు కూర్పు సరిగ్గా ఉంటే ఎంతటి సత్ఫలితాలు వస్తాయి అన్నది కోహ్లీకి  బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్. తాను అంచనా వేస్తున్న ప్రకారం అయితే భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ లో ఎవరికో ఒకరికి మాత్రమే తుది జట్టులో చాన్సు దొరికే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ  కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉందని అన్నాడు. ఇక మూడవ స్థానంలో కోహ్లీ, నాలుగవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో రిషబ్ పంత్.. ఆతర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్ లేదా రాహుల్ చాహర్ ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో ఏడు సార్లు పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగగా ఒక్కసారి కూడా టీమిండియా ఓడిపోలేదు అంటూ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: