ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఎంతో పటిష్టంగా ఉన్న టీమ్ ఇండియా జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ఊహించని పరాభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఒక్క సారి కూడా దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడిపోని టీమిండియా మొదటిసారి ఓటమి చవి చూసి తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాభవం మూట కట్టుకోవడం పైన భారత క్రికెట్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.


 ఎంతో పటిష్టంగా ఉన్న భారత జట్టు ఇంత దారుణమైన ఓటమి పాలు కావడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై అటు మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో సోషల్ మీడియాలో భారత అభిమానులు మాత్రం ఇండియా జట్టుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమి పై ఇటీవలే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు వ్యూహాల పై ప్రశంసలు కురిపించాడు సచిన్ టెండూల్కర్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ టీమిండియా జట్టు 25 పరుగులు తక్కువ లక్ష్యాన్ని పాకిస్థాన్కు ఇచ్చింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఇక షాహిన్ ఆఫ్రిది వేసిన ఆఫ్ ఫ్రంట్ బంతులను ఎదుర్కోవడంలో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది అంటూ తెలిపాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ ఫుట్వర్క్ సరిగా లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపించాడు సచిన్ టెండూల్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: