పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఓటమి న్యూజిలాండ్ ను బాగా కృంగదీసింది అని చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా వరల్డ్ కప్ టైటిల్ కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత వెంటనే ఇండియాతో ఇండియాలో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ మరియు రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఫైనల్ ఓటమి నుండి ఇంకా తేరుకొని కివీస్, కెప్టెన్ విలియమ్సన్ లేకపోవడంతో టీ 20 సిరీస్ ను 3 - 0 తో ఓడిపోయింది. రేపటి నుండి ఇరు జట్ల మధ్య  మొదటి టెస్ట్ మొదలు కానుంది. ఈ టెస్ట్ కోసం రెండు జట్లు కూడా ఎంతో సమాయత్తం అవుతున్నారు. దెబ్బతిన్న పులిలా కివీస్ ఆటగాళ్లు గెలుపు రుచి చూడడానికి ఎదరుచూస్తున్నారు.

అయితే ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అంటే ప్రపంచ జట్లు అందరికీ ఒక భయం ఎప్పటి నుండో ఉంది. ఇక్కడ ఇండియా గడ్డపై స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొని మ్యాచ్ ను గెలవడం అంటే అంత సులభం కాదు. ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లపై విదేశీ బ్యాట్స్ మాన్ లకు భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంటే కఠినమైన సవాలు అనే చెప్పాలి. కానీ న్యూజిలాండ్ మాత్రం ఈ సారి గట్టిగానే సన్నద్ధం అయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ సైతం భారత్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఆడడానికి నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కాన్పూర్ వేదికగా మొదటి టెస్ట్ ఆడనున్నారు.

ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఇండియాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకుంది, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అజింక్య రహానే సారధ్యంలోని టీం ఇండియా సిద్ధంగా ఉంది. మరి ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరించనుందో తెలియాలంటే ఇంకో అయిదు రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: