మార్క్ రామ్ కేవలం 7 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత కీగన్ పీటర్సన్ కు జతగా కెప్టెన్ డీన్ ఎల్గర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. కానీ త్వరగా సౌత్ ఆఫ్రికాను ఆల్ అవుట్ చేయకపోతే మ్యాచ్ ఇండియా చేజారిపొయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ అత్యంత తెలివిగా బౌలర్లను ఉపయోగించాలి. బ్యాట్స్ మాన్ కు తగిన విధంగా బౌలర్ ను దింపుతూ ఫలితాన్ని రాబట్టాలి. ఈ దశలో కీగన్ పీటర్సన్ తన అర్ద సెంచరీని పూర్తి చేసుకోగా, ఎల్గర్ 28 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ అవకాశాన్ని వాడుకుని కొత్తగా వచ్చే బ్యాట్స్ మాన్ లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేస్తే ఖచ్చితంగా 200 పరుగుల లోపే సఫారీలను ఆల్ అవుట్ చేయవచ్చు.
ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే సౌత్ ఆఫ్రికాను 300 పరుగుల లోపే కట్టడి చెయ్యాలి. ఆ తర్వాత ఇండియా కనీసం 350 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువవుతాయి. లేదంటే ఫలితం వేరేలా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా బౌలింగ్ విభాగం కన్నా, సౌత్ ఆఫ్రికా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. మరి కొత్త కెప్టెన్ రాహుల్ ఏ విధంగా జట్టును గెలుపు దిశగా నడుపుతాడో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి