సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుంచి ఆ జట్టులో స్టార్ ఆటగాడు చాలా తక్కువే అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ లో ప్రేక్షకులకు తెలియని ఒక అనామక ప్లేయర్ లతో సన్రైజర్స్ ఎప్పుడు మ్యాచ్ ఆడుతూ ఉంటుంది..  ఇలా ఎలాంటి అనుభవం లేని ప్లేయర్లు కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేస్తే.. మరి కొంత మంది ప్లేయర్స్ మాత్రం నిరాశ పరుస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం మెగా వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మంచి స్టార్ ప్లేయర్ లని కొనుగోలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మళ్లీ ఎంతోమంది అనామక ప్లేయర్లను తీసుకుంది.



 ముఖ్యంగా ప్రస్తుతం ఫాంలో లేకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నీకోలాస్ పురాన్ కోసం పోటీపడి మరీ 10 కోట్లు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ క్రికెటర్ రోమానియా కోసం  7.75 కోట్లు ఖర్చు పెట్టింది సన్రైజర్స్. ఇక రాహుల్ త్రిపాటి, ఎయిడెడ్ మార్కారమ్, వాషింగ్టన్ సుందర్,  ఫిలిప్స్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం సన్రైజర్స్ కు కాస్త ఊరట కలిగించే అంశమే. డేవిడ్ వార్నర్ బెయిర్ స్ట్రో లను మెగా వేలంలో కి వదిలేసిన సన్రైజర్స్  మళ్ళీ కొనుగోలు చేయలేదు. దీంతో ఓపెనింగ్ జోడిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే నీకోలాస్ పూరన్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశం ఉంది.


 ఇదే విషయంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు   సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్  లో కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో ఎక్కువగా వస్తూ ఉంటాడు. ఇప్పుడూ జట్టులోకి పురాన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో విలియమ్సన్ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తనకు ఎప్పుడూ అచ్చి వచ్చే మూడవ స్థానాన్ని త్యాగం చేయడం అంటే బకరా అయ్యాడు అన్నట్లు లెక్క. అయితే పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు రాబట్టాలి అంటే మాత్రం ఛాన్స్ ఇవ్వడం మినహాయించి ఇక కేన్ విలియమ్సన్ ముందు మరో ఆలోచన ఉండదు అని నా అభిప్రాయం అంటూ వసీం జాఫర్ షాకింగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: