ఆస్ట్రేలియా కు చెందిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను ఢిల్లీ క్యాపిటల్ 6.5 కోట్ల మొత్తానికి ఫిబ్రవరి లో జరిగిన మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు జట్లకు ఆడిన మిచెల్ మార్ష్ ఎప్పుడూ గాయాల కారణంగా పూర్తి సీజన్ ఆడిన దాఖలాలు లేవు. అయితే ఈ సీజన్ అయినా ఆడతాడని భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ప్రస్తుతం మార్ష్ గాయంతో బాధపడుతున్నాడు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే మిచెల్ మార్ష్ ఈ ఐపిఎల్ సీజన్ కు కూడా దూరం కానున్నాడు.
ఇది నిజంగా ఢిల్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్. అయితే ఇతని స్థానంలో ఎవరిని భర్తీ చేయనున్నారో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి మంచి ఊపుమీదుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి