ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ప్రతిభతో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాలని ఆశతో ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతు ఉంటారు. ఇలా ప్రతి ఏడాది ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో తెరమీదకి వస్తూనే ఉంటారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో టీమిండియా అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోయింది అని చెప్పాలి.


 దీంతో ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి తీవ్రమైన పోటీ మధ్య సాదా సీదా ప్రదర్శన కాదు అద్భుతమైన ప్రదర్శన తో సెలెక్టర్ల చూపును ఆకర్షించాల్సిన ఒక అతిపెద్ద సవాల్ ప్రతి యువ ఆటగాడు ముందు ఉంది అని చెప్పాలి. ఇలా తమ టాలెంట్ చూపిస్తున్న యువ ఆటగాళ్లు ఒత్తిడిలో కూడా ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా ఈ ఏడాది ప్రతిభ చూపిస్తున్న ఆటగాళ్లలో అటు పంజాబ్ కింగ్స్   తరఫున ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ పేసర్ బౌలర్ హర్ష దీప్ సింగ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఎంతో ఒత్తిడిలో ఉన్న కూల్ గా కనిపిస్తూ ఎంతో క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు.



 ఈ క్రమంలోనే హర్ష దీప్ బౌలింగ్ ప్రతిభపై ఇటీవలే మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హర్ష సుదీప్ ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అతను భవిష్యత్తులో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. హర్ష దీప్ 140- 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగా పోయినప్పటికీ తాను అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా బంతులు విసురుతూ వికెట్లు రాబడుతున్నాడూ అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl