ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ ఎంత పేలవ మైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తక్కువ పరుగులు చేయడానికి కూడా ఆపసోపాలు పడుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు సెంచరీలు హాఫ్ సెంచరీల  తో పరుగుల యంత్రం గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడాన్ని చూసి జీర్ణించు కోలేక పోతున్నారు అభిమానులు. ప్రతి మ్యాచ్లో విరాట్ కోహ్లీ బాగా రాణిస్తారు అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగులుతుంది అని చెప్పాలి.


 ఇకపోతే గత రెండు మూడు మ్యాచ్ లలో కూడా వరుసగా డకౌట్ లూ అవుతూ విరాట్ కోహ్లీ వెను దిరిగాడు. ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కాస్త ఫాం లోకి వచ్చినట్లు అనిపించింది విరాట్ కోహ్లీ. ఏకంగా మెరుపు వేగం తో 20 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత అనవసరమైన షాట్ ఆడి వికెట్ చేజార్చు కున్నాడు. ఇలా అభిమానులను నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ అటు రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవల ఐపిఎల్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 6500 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా  రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోహ్లీ.. 15 సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ప్లేయర్ గా కూడా  రికార్డు సాధించాడు. 2011లో బెంగళూరు నాయకత్వం అందుకున్నాడు విరాట్ కోహ్లీ. 2016లో కోహ్లీ సారధ్యం లో జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇకపోతే ఇటీవల పేలవమైన ఫామ్ కొనసాగు తున్నప్పటికీ రికార్డులూ సాధించడం  మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: