ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే అటు అంపైర్లు ఇస్తున్న తప్పుడు నిర్ణయాలు కొంతమంది ఆటగాళ్లకు శాపంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అటు అంపైర్ల నిర్ణయాలపై ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే ఆటగాళ్లు రివ్యూ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు సరైన సమయంలో రివ్యూ ఉపయోగించుకుంటూ లాభం పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా అంపైర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఏదైనా అనుమానం ఉన్నప్పుడు వెంటనే ఆటగాడు ఎంపైర్ కు రివ్యూ కావాలి అంటూ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం బ్యాట్స్మెన్ రివ్యూ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో మైదానం లో గందరగోళ పరిస్థితి నెలకొంది.  ఐపీఎల్ లో భాగంగా ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కత నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక కోల్కతా ఇన్నింగ్స్ లో భాగంగా 12 ఓవర్లలో టీ నటరాజన్ రింకు సింగ్ కి ఒక అద్భుతమైన యార్కర్ సంధించాడు.


 అయితే రింకు సింగ్ దానిని డిఫెండ్  చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ కు దగ్గరగా వెళుతూ ఉంది. చివరికి ప్యాడ్ కు తగిలింది. అయితే వెంటనే బౌలర్ తో పాటు ఫీల్డర్లు  అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అయితే నాన్ స్ట్రైక్ లో ఉన్న బిల్డింగ్స్ రింకు సింగ్ చర్చించుకున్న తర్వాత రివ్యూ ను ఫీల్డ్ అంపైర్లు తిరస్కరించారు. ఎందుకంటే రివ్యూ సిగ్నల్ రింకు  కాకుండా బిల్లింగ్స్ ఇవ్వడం దీనికి కారణం. సాధారణంగా బ్యాట్స్మెన్ స్వయంగా రివ్యూ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అటు బిల్లింగ్స్ సిగ్నల్ ఇవ్వడంతో అంపైర్ దానిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl