ప్రపంచ క్రికెట్లో పసికూనగా ప్రస్థానం మొదలుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు తక్కువ సమయంలోనే ఎంతో పటిష్టమైన జట్టుగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ప్రపంచ క్రికెట్లో దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న వారికి సైతం పోటీ ఇచ్చే విధంగా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా కొనసాగిన  మొమినుల్ హాక్ ఇటీవలే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.



 అయితే అతని కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు సరైన విజయం సాధించక పోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే జట్టుకు సరైన విజయాలు అందించిన లేనప్పుడు కెప్టెన్సీ చేయలేను అంటూ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్లో సీనియర్ ఆల్రౌండర్గా కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇక వైస్ కెప్టెన్ గా లిటన్ దాస్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.


 ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడిపోయింది బంగ్లాదేశ్ జట్టు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టుగా చెప్పడంతో.. కొత్త కెప్టెన్గా మరోసారి బంగ్లాదేశ్ టెస్టు జట్టు పగ్గాలు షకీబ్ అల్ హసన్  చేపట్టడం గమనార్హం. 2019లో కూడా అటు బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ వ్యవహరించాడు ఈ ఆల్రౌండర్  పై ఐసీసీ నిషేధం విధించిన తెలిసిందే. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కి ముందు బుకీలు అతడిని సంప్రదించిన ఆ విషయాన్ని అతను దాచిపెట్టి అవినీతి నిరోధక భద్రత విభాగానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లక పోవడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం పడింది. దీంతో అతని కెప్టెన్సీ కూడా కోల్పోయాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: