సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. అద్భుతంగా రాణించి అదరగొడుతుంది అనుకున్న టీమిండియా చివరికి మొదటి టి20 మ్యాచ్ లోనే పరాజయం పాలైంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావించిన.. చేదు అనుభవం మాత్రం తప్పు లేదు అని చెప్పాలి. రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా మంచి ప్రదర్శన చేసింది. మొదటినుంచి బ్యాట్స్మెన్లు ఎంతో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేయగలిగింది.


 అదే సమయంలో సొంత గడ్డపై భారత బౌలర్లకు పట్టు ఉంటుంది కాబట్టి సౌత్ఆఫ్రికా గెలవడం అసాధ్యం అనుకున్నారు అందరు. కానీ ఇక ఎంతో అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ లు డేవిడ్ మిల్లర్, వాన్ డెర్ డాసన్ లు ఇక తమ జట్టుకు విజయాన్ని అందించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 211 పరుగుల లక్ష్యాన్ని ఎంతో అలవోకగా 19.1 ఓవర్లలోనే ఛేధించింది సౌత్ ఆఫ్రికా జట్టు. దీంతో అటు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి టీ20 మ్యాచ్లో ఓటమి పై కెప్టెన్ రిషబ్ పంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు రిషబ్ పంత్. అయితే బౌలింగులో కాస్త తేలి పోయామని పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేక పోయాము అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇక ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి టీ20 మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్, వాన్ డెర్ డాసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మాచర్లలో కచ్చితంగా మరింత మెరుగ్గా రాణించి చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రిషబ్ పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: