గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన టెస్ట్ సిరీస్ లో చివరి టెస్ట్ కొన్ని కారణాల వలన ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్ట్ ను ఇప్పుడు జులై 1 న జరపనున్నారు. దీనితో ఇప్పుడు అందరి దృష్టి ఈ టెస్ట్ పై నెలకొంది. కానీ ఇక్కడ అప్పుడు రెండు జట్లు ఉన్న పరిస్థితి ఇప్పుడు అయితే లేడనై చెప్పాలి. రెండు జట్లు కూడా చాలా మారాయి. ఇప్పటికిప్పుడు చూస్తే... ఇండియా కన్నా రెండు ఇంతలు ఇంగ్లాండ్ బలంగా ఉందని చెప్పవచ్చు. ఈ కారణంగా ఇండియా ఫ్యాన్స్ లో భయం మొదలైంది. దీనికి కారణం నిన్న న్యూజిలాండ్ తో ముగిసిన మూడు టెస్ట్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడమే. మూడు మ్యాచ్ లలోనూ కివీస్ ను చిత్తు చిత్తు గా ఓడించి ఇండియా తో మ్యాచ్ కు సిద్ధమైంది.

ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ రూట్, బైర్ స్టో, స్టోక్స్, బట్లర్, ఓలీ పొప్ లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లోనూ బ్రాడ్, లీక్, పాట్స్ లు కూడా రాణిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ తనదైన దూకుడు కలిగిన నాయకత్వంతో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇక బ్రెండన్ మెక్ కలమ్ రూపంలో అనుభవజ్ఞుడైన కోచ్ ను కూడా ఇంగ్లాండ్ కలిగి ఉండడం వారికి అదృష్టం అని చెప్పాలి.

ఈ టెస్ట్ నిజంగా ఇండియాకు ఒక కఠిన పరీక్ష అని చెప్పాలి. ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏ విధంగా ఈ పరీక్షలో తన అస్త్రాలను ఉపయోగించి ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టిస్తాడు అన్నది చూడాలి. కాగా రోహిత్ శర్మ ఈ టెస్ట్ కు దూరం కావడం తో తదుపరి కెప్టెన్ ఎవరన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: