గత కొంత కాలం నుంచి టీ20 ఫార్మాట్ కి ఊహించని రీతిలో విశేషమైన ఆదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో క్రికెట్ కు మూలమైన టెస్ట్ ఫార్మాట్ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆటగాళ్ళు  కూడా టి20లు ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టెస్టు ఫార్మాట్లో భాగం కావడానికి పెద్దగా ముందుకు  రావడం లేదు. ఇలాంటి సమయంలో టెస్ట్ ఫార్మాట్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అన్న విషయంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అయితే టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ కనుమరుగు అవ్వదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ రానున్న రోజుల్లో టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు కనిపించకపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాణ్యమైన క్రికెటర్లు ఆడుతున్నంత సేపు టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా ఉండదు అంటూ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ కనుమరుగవడం జరుగదు. కానీ ఈ ఫార్మాట్ ఆడేది ఎవరు అన్నది పెద్ద ప్రశ్న.. నాణ్యమైన ఆటగాళ్లు లేనప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఆసక్తి ఉంటుందా.. అంటే అస్సలు ఉండదు అని చెప్పాలి. అయితే ఐదు రోజులపాటు జరిగే టెస్ట్ క్రికెట్ జనరంజకంగా ఉండాలంటే నాణ్యమైన ఆటగాళ్లు కావాలి అంటూ చెప్పుకొచ్చాడు.


 ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న స్టార్ క్రికెటర్ లు అందరూ కూడా టి20 లీగ్ లలో ఆడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో యాడ్ చాప్లిన్ వ్యాఖ్యలు చేశాడు  అన్నది తెలుస్తుంది. అయితే యూఏఈలో జరగబోయే టీ20 లీగ్ లో ఆడేందుకు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాల్సిందిగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్  క్రిస్ లిన్ ఆ దేశ క్రికెట్ బోర్డు ను కోరాడు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్ లు వేగంగా విస్తరించడం వల్ల టెస్ట్ క్రికెట్ కు ఎక్కువ నష్టం జరుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు టి 20 లీగ్ లు పెరిగిపోవడం వల్ల ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడిపోతున్నాయి అంటూ వ్యాఖ్యానించాడు ఇయాన్ చాపెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: