అంతర్జాతీయ క్రికెట్లో అతి పెద్ద టీ20 లీగ్ గా కొనసాగుతోంది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అయితే ఐపీఎల్ అంతకంతకూ పాపులారిటీ సంపాదించడం పై అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఎప్పుడూ అసూయను వ్యక్తపరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏదో ఒకటి ఐపీఎల్ పై కామెంట్లు చేస్తూ ఉంటుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే పలుమార్లు ఐపీఎల్ విండో పై ఫిర్యాదులు చేసి చేయి కాల్చుకుంది. ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్కు ఘోరమైన ఎదురు దెబ్బ తగిలింది అని తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే ఐపీఎల్కు పోటీ ఇస్తాము అంటూ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ తో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్ బోర్డు. ఐపీఎల్ జరిగే సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కూడా కూడా జరిగే అవకాశం ఉంది. 2025 లో ఈ రెండు లీగ్ ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పాకిస్తాన్లో జరుగనున్న ఛాంపియన్ ట్రోఫీ, దేశవాళి క్రికెట్ బిజీ సీజన్ మధ్య ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహించడం సందిగ్ధంలో పడిపోయింది అని చెప్పాలి. ఐపీఎల్ మార్చి నుంచి ప్రారంభమై జూన్ వరకు కొనసాగుతోంది.


 దాదాపు రెండున్నర నెలలపాటు ఐపీఎల్ ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో జరుగనుంది. కానీ 2025 లో పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. తద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ దేశీయ టీ20 లీగ్ ను  మార్చి నుంచి మే నెలలో నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు లీగ్ లు ఒకేసారి జరిగితే ఆటగాళ్లు ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఘోరమైన అవమానం తప్పదు అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: